4 గ్రామాల్లో”తొలిముద్ద”ప్రారంభించిన సర్పంచులు
ప్రజావాణి,నెల్లికుదురు: తొలిముద్ద కార్యక్రమాన్ని మండల కేంద్రం నెల్లికుదురు,వస్రాం తండా,మునిగలవీడు,మదన తుర్తి గ్రామాల్లోని అంగన్వాడీ సెంటర్లలో సెక్టార్ సూపర్వైజర్ సరిత ఆదేశాల మేరకు అంగన్వాడి టీచర్ల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల సర్పంచులు సోమవారం ప్రారంభించారు.
*నెల్లికుదురులో..*
నెల్లికుదురు అంగన్వాడి సెంటర్ లో స్థానిక సర్పంచి పులి వెంకన్న తొలిముద్దకార్యక్రమాన్ని ప్రారంభించారు.చిన్నారులకు సర్పంచి బ్రేక్ ఫాస్ట్ వడ్డించారు.కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దేవయ్య,అంగన్వాడి టీచర్లు మద్ది విజయ,ఐ.పద్మ ఎం.పద్మ,కె.పద్మ,జ్యోతి, మాధవి,పిల్లలు,గర్భిణీలు,బాలింతలు,కిశోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.
*వస్రాం తండాలో..*
వస్త్రం తండా అంగన్వాడి సెంటర్లో తొలిముద్దు కార్యక్రమాన్ని ఆ గ్రామ సర్పంచి గుగులోతు కరుణ మధు ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లలకు అల్పాహారం అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు తొట్ల వెంకటలక్ష్మి,వసంత, లక్ష్మి,ఆశా వర్కర్ శారద, పిల్లలు తల్లులు బాలింతలు పాల్గొన్నారు.
*మునిగలవీడులో..*
మునిగిల వీడు అంగన్వాడి సెంటర్లో స్థానిక సర్పంచి దొలికొండ చైతన్య నాగరాజు తొలిముద్దు కార్యక్రమాన్ని పిల్లలకు అల్పాహారం వడ్డించి ప్రారంభించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు వీరలక్ష్మి,జమాల్బి,మహతి,వెంకటమ్మ,చిన్నారులు,తల్లులు కిశోర బాలికలు పాల్గొన్నారు.మదన తుర్తి లో ఆ గ్రామ సర్పంచ్ తో పాటు అంగన్వాడీ టీచర్లు ఎం పుష్పలత జి సత్తెమ్మ పాల్గొని తొలిముద్ద ప్రారంభించారు.
*తొలిముద్దతో పోషకాహారం: సర్పంచులు*
ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులు కరుణ మధు,బొల్లికొండ చైతన్య నాగరాజు,పులి వెంకన్న మాట్లాడుతూతెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లోని 3 సం.ల నుంచి 6 సం.ల లోపు ఫ్రీ స్కూల్ చిన్నారులకు
పౌష్టికాహారంతో కూడిన ఉదయపు అల్పాహారం అందించడానికి తొలిముద్ద కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు.చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడం,అంగన్వాడీ కేంద్రాలకు పిల్లల హాజరు శాతాన్ని పెంచడం ఈ పథకం లక్ష్యం అన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
