12వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమం
* పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్
జమ్మికుంట నవంబర్ 23 (ప్రజావాణి)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ పరిధిలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం యొక్క ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి అని తెలుపుతూ ఈకుటుంబ బీమా పథకం కోసం కావలసినవి రేషన్ కార్డు ఫోన్ నెంబర్ అని తెలుపుతూ మీ మీ వార్డులలో వార్డ్ ఆఫీసర్ దగ్గర నమోదు చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ చుంచు రమాదేవి,చుంచు శివ,విజయ తదితరులు పాల్గొన్నారు