prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 8:31 pm Digital Edition : PRAJA VANI

సోహం ఇతనాల్ ఇండస్ట్రీ అప్రజాస్వామికమైన ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలి

సోహం ఇతనాల్ ఇండస్ట్రీ
అప్రజాస్వామికమైన ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలి.

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 23

-సోహం ఇతనాల్ ఇండస్ట్రీ నుండి కృష్ణా నది జలాలను కాపాడాలి.వన్యాప్రానులను మూగజీవాలను

-వీర్లపాలెం ప్రజల ప్రాణాలు కాపాడాలి

-గ్రామస్థుల డిమాండ్

20 నవంబర్ 2026 రోజున దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో సోహం ఇండస్ట్రీ ఇతనాల్ కంపెనీకి సంబంధించి జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ ఆప్రజాస్వామీకమైనదని అన్నారు ప్రజాభిప్రాయ సేకరణ పై నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ కి అట్టి ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణ నిర్బంధాల మధ్య బెదిరింపుల మధ్య కొనసాగిందని ఇది ప్రజా వ్యతిరేకమైన ప్రజాభిప్రాయ సేకరణని వారన్నారు. వీర్లపాలెం గ్రామంలో సుమారు 5000 మంది జనాభా ఉంటే ఈ 20 మందికి లోపే అభిప్రాయాలు తీసుకోవడం ఇది ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణకు నిదర్శనం అన్నారు. కంపెనీకి సంబంధించిన కొంతమంది తాబేదారులను తీసుకొచ్చి వారి అభిప్రాయాలను ఇప్పించడం,అక్కడి షెడ్యూల్ ట్రైబల్ ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోవడం అసమాన వైఖరికి నిదర్శనం అన్నారు. ఇతనాల్ కంపెనీలపై అధ్యయనం చేసినటువంటి నిపుణుల యొక్క అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకోకపోవడం ప్రభుత్వం యొక్క నియంతృప్తి నిదర్శనం అన్నారు. కొంతమంది వ్యక్తులు ఈ కంపెనీ పట్ల మాకు అపోహాలు ఉన్నాయని దీని ద్వారా క్యాన్సర్ వస్తుందని మరియు కృష్ణా నది జలాలు కలుషితమయ్యే అవకాశం ఉందని, కృష్ణా నదికి ఈ కంపెనీ పెట్టబోయే ప్రాంతానికి 3 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండడం తీవ్రమైనటువంటి భయాన్ని కలిగిస్తుందన్నారు.సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గాని ఆర్డిఓ గాని మరియు కంపెనీ యజమాన్యం గాని ఎలాంటి సమాధానం ఇవ్వకుండా అర్ధాంతరంగా ప్రజాభిప్రాయ సేకరణ ముగించారు. కొంతమంది యువకులు హైకోర్టులో రిట్ పిటీషన్ వేసినప్పటికీ హైకోర్టు ధర్మాసనం వారి యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని తీర్పు ఇచ్చినప్పటికీ అట్టి తీర్పును ధిక్కరించి వారందరినీ అక్రమంగా అరెస్టు చేసి వేరువేరు పోలీస్ స్టేషన్ లో నిర్భందించడం జరిగిందన్నారు.ఇది అప్రజాస్వామీక చర్యగా మేము భావిస్తున్నాం అన్నారు.కాలుష్యం వెదజల్లని, ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లని ఎలాంటి పరిశ్రమలు పెట్టినా ఆ ప్రాంత ప్రజలు స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారని వారన్నారు. ఒకవైపు ఎల్ నినో ప్రభావంతో ప్రజలు రైతాంగం తీవ్రమైన కరువుతో అల్లాడుతుంటే, మరొకవైపు విషపూరితమైన కంపెనీలను తీసుకొచ్చి,రోజుకు 60 లక్షల లీటర్ల నీటిని కృష్ణా నది నుండి తీసుకోవడం,ప్రజల ప్రాణాలతో చేలగాటమాడడం విధ్వంసక అభివృద్ధికి నిదర్శనం అన్నారు. ప్రజాస్వామికంగా జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ రద్దుచేసి నూతనంగా ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి భయభ్రాంతులకు లోను కాకుండా బెదిరింపులకు పాల్పడకుండా ప్రజలందరికి స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో తమ యొక్క అభిప్రాయాలను కంపెనీ పట్ల వెల్లడించే విధంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
నేనావత్ సిపాయి, గుంజ రామయ్య,రూపావత్ సోమణి, అల్లం నాగరాజు, వినోద్, ప్ శ్రీను ,రూపావత్ సైదా, రూపవత్ లక్ష్మి, మూడావత్ కిరి,ధనవత్ తరుణ్ రుపావతు బాజు, ఏడుపాల సౌజన్య రెడ్డి , ధనావత్ సైది , రూపావత్ శ్రీను, తోపాటు వంద మంది వీర్లపాలెం ప్రజలు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.