*సేవా కార్యక్రమాలతో ఘనంగా కడారి చామంతి 30వ పుట్టినరోజు వేడుకలు*
*వృద్ధులకు, వికలాంగులకు పండ్ల పంపిణీ*
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. మంచాల నవంబర్ 23 (ప్రజావాణి): మంచాల
తన పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం అభినందనీయమని పలువురు కొనియాడారు.
కడారి చామంతి 30వ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు, వికలాంగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులు, వికలాంగులకు పండ్లు అందజేసి వారి పట్ల ప్రేమాభిమానాలను చాటుకున్నారు.
పుట్టినరోజు వేడుకలను కేవలం వ్యక్తిగత సంబరాలకే పరిమితం చేయకుండా సమాజంలోని నిరుపేదలు, వృద్ధులు, వికలాంగుల మధ్య జరుపుకోవడం ప్రత్యేకతగా నిలిచింది. సేవా భావంతో నిర్వహించిన ఈ కార్యక్రమం పలువురిని ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా కడారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ప్రజా ప్రతినిధులు. కడారి చామంతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతూ అందరి మన్ననలు పొందాలని కోరుకున్నారు.