prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 10:46 am Digital Edition : PRAJA VANI

సర్పంచ్ కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

సర్పంచ్ కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
కేక్ కట్ చేసి చిన్నారిని ఆశీర్వదించిన కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
దండేపల్లి (ప్రజావాణి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లక్ష్మీకాంతాపూర్ గ్రామ సర్పంచ్ చిలుకూరి మహేష్ కుమారుడి పుట్టినరోజు వేడుకల్లో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి, కేక్ కట్ చేసి ఆశీర్వదించారు. చిన్నారి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొని చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.