మనోహరాబాద్ పాఠశాలకు వెళ్లే దారిలో పైప్లైన్ లీకేజీ.. విద్యార్థుల ఇబ్బందులు పట్టించుకోని అధికారులు!
*మనోహరాబాద్ పాఠశాలకు వెళ్లే దారిలో పైప్లైన్ లీకేజీ.. విద్యార్థుల ఇబ్బందులు పట్టించుకోని అధికారులు* *నీరు రోడ్డుపై ప్రవహిస్తూ రాకపోకలకు అంతరాయం.. వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికుల డిమాండ్* మనోహరాబాద్: మండల కేంద్రంలోని మనోహరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లే మార్గంలో నీటి పైప్లైన్ పగిలి లీకేజీ అవుతుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైప్లైన్ నుంచి నీరు నిరంతరం రోడ్డుపై ప్రవహిస్తూ నిల్వ ఉండటంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు. పాఠశాలకు వెళ్లే ప్రధాన మార్గంలో నీరు నిలవడంతో...