prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 5:03 pm Digital Edition : PRAJA VANI

మంచాల గ్రామంలోని 11వ వార్డు గ్యార అనూష శేఖర్ నివాసంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

*మంచాల గ్రామంలోని 11వ వార్డు గ్యార అనూష శేఖర్ నివాసంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత.*
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంచాల నవంబర్ 23 (ప్రజావాణి) : సత్యనారాయణ స్వామి వ్రతం పూజా కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటిని అందంగా అలంకరించి, వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వ్రత విధివిధానాలను శాస్త్రోక్తంగా నిర్వహించి, అనంతరం సత్యనారాయణ స్వామి కథా పారాయణం చేపట్టారు. కుటుంబ సభ్యులు, బంధువులు భక్తితో పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్థానిక ప్రముఖులు, బంధుమిత్రులు హాజరై కౌన్సిలర్ గ్యార అనూష శేఖర్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియా మిత్రుడు వైస్సార్సీపీ మాదారమోని జంగయ్య.కడారి లింగం కూడా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని భక్తులు కోరుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కుటుంబ సభ్యుల్లో ఐక్యతను, భక్తిభావాన్ని పెంపొందిస్తాయని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. పూజా కార్యక్రమం భక్తి వాతావరణంలో ఆనందోత్సాహాల మధ్య అన్నదాన కార్యక్రమం పూజా కార్యక్రమం ఘనంగా జరిగాయి.