prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 5:18 pm Digital Edition : PRAJA VANI

భైంసా మున్సిపల్ నూతన కమిషనర్‌గా నరేష్ బాధ్యతల స్వీకరణ

*భైంసా మున్సిపల్ నూతన కమిషనర్‌గా నరేష్ బాధ్యతల స్వీకరణ*

*శాలువా, పుష్పగుచ్ఛంతో ఘన స్వాగతం పలికిన మున్సిపల్ చైర్మన్ తుమ్మల దత్తాత్రి, కౌన్సిలర్లు*

నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో భైంసా నవంబర్ 23:–
భైంసా మున్సిపాలిటీకి నూతన కమిషనర్‌గా నరేష్ నియమితులై బాధ్యతలు స్వీకరించారు. ఈ నెలలో ఇంచార్జి కమిషనర్‌గా విధులు నిర్వహించిన సంతోష్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో మున్సిపాలిటీకి నూతన కమిషనర్‌గా నరేష్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తుమ్మల దత్తాత్రి ఆధ్వర్యంలో నూతన కమిషనర్ నరేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తాలోడ్ రాధిక శ్రీనివాస్, సుభాష్, ప్రవీణ్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. నూతన కమిషనర్ బాధ్యతలు చేపట్టడంతో పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందించే దిశగా సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు ఆకాంక్షించారు.