భాస్కర్ లేచి నడవలేడు, కానీ అతని కుటుంబం నిలబడాలి.. జిల్లా కలెక్టర్
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 23 (ప్రజావాణి): జిల్లాలోని జఫర్గఢ్ మండలం, వడ్డెగూడెం గ్రామానికి చెందిన తాటికాయల భాస్కర్ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలపాలయ్యారు. వెన్నెముకకు తీవ్ర గాయాలు కావడంతో ఇకపై నడవలేని పరిస్థితి ఉంటుందని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు (ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు) ఉన్నారు. కుటుంబానికి ఆసరాగా నిలిచే కుటుంబ పెద్ద మంచానికే పరిమితం కావడంతో ఆ కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక, మానసిక ఇబ్బందులు మరింత పెరిగాయి. ఈ విషయం...