*బ్రాహ్మణపల్లి శ్రీనివాస్ గౌడ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు*
మేడ్చల్: ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని డబిల్‌పూర్ వార్డులో మాజీ ఉమ్మడి మేడ్చల్ మండల బీసీ సెల్ అధ్యక్షులు బ్రాహ్మణపల్లి శ్రీనివాస్ గౌడ్ ప్రథమ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్లంపేట్ మున్సిపల్ ప్రెసిడెంట్, కౌన్సిలర్ విఘ్నేశ్వర్ రెడ్డి పాల్గొని శ్రీనివాస్ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ సంజీవరావు, మండల కో-ఆప్షన్ సభ్యులు అక్రమ్ పాషా మాట్లాడుతూ, శ్రీనివాస్ గౌడ్ పదవులకు అలంకారంగా కాకుండా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ప్రజా నాయకుడని కొనియాడారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ప్రజల కోసం చేసిన సేవలు, చూపిన సేవాభావం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఒక నాయకుడు మరణించినా ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు ఎన్నటికీ మరణించవని, ప్రజాసేవలో ఆయన వేసిన అడుగుజాడలు తమకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రథమ వర్ధంతి సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ అధ్యక్షులు చందర్ గౌడ్, భవాని వెంకటేష్ యాదవ్, మునిగొండ శేఖర్, ఆకుల రాజు, బాలు ముదిరాజ్, ఆకుల శేఖర్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.