prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 4:58 pm Digital Edition : UPENDHAR JANAGON

బొబ్బలి అబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎర్రబెల్లి దయాకర్ రావు

బొబ్బలి అబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎర్రబెల్లి దయాకర్ రావు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 23 (ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండలం, ధర్మాపురం గ్రామానికి చెందిన బొబ్బలి అబ్బయ్య గత కొద్ది రోజుల క్రితం మరణించారు.

ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం ధర్మాపురం గ్రామంలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ముందుగా బొబ్బలి అబ్బయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడి వారిని ఓదార్చారు. అబ్బయ్య లేని లోటు ఎవరూ భర్తీ చేయలేనిదని, ఆ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, బొబ్బలి అబ్బయ్య పార్టీకి నిబద్ధత గల కార్యకర్త అని కొనియాడారు. పార్టీ కోసం, గ్రామ అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. ఆయన మరణం పార్టీకి, గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.