prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 9:12 pm Digital Edition : PRAJA VANI

బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

– ఉపసర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి రాపర్తి సంధ్య-కొంరయ్య,వార్డు సభ్యులు,గౌడ సొసైటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరిక

* కాంగ్రెస్ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు చూసి ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వెల్లడి

* పార్టీకండువా కప్పి ఆహ్వానించిన హుజురాబాద్ ఇంచార్జి వొడితల ప్రణవ్

జమ్మికుంట నవంబర్ 23 (ప్రజావాణి)

కరీంనగర్.జిల్లావీణవంకమండలం పోతిరెడ్డిపల్లి గ్రామం నుండి బీఆర్ఎస్,బీజేపీ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి.వీణవంక మండల అధ్యక్షుడు రఘుపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పోతిరెడ్డిపల్లి గ్రామ ఉపసర్పంచ్ రాపర్తి సంధ్య-కొంరయ్య,వార్డు సభ్యులు పుష్పలీల,గౌడ సంఘం సొసైటీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి రాజు,నాగిళ్ల సూర్యం,సయ్యద్,ఖలీం,రాపర్తి నితీష్ లు పార్టీలో చేరారు.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇళ్లు,సన్న బియ్యం,నూతన పెన్షన్లు,ఉచిత విద్యుత్ లాంటి పథకాలకు ఆకర్షితులై,ప్రణవ్ నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీలో చేరామని తెలిపారు.అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామని,ఆరు గ్యారంటీలను అమలు చేస్తూనే,నూతనంగా పెన్షన్లను,ఇందిరా కుటుంబ జీవిత భీమా లాంటి పథకాలను అందిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు