ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ శ్రేణుల మద్దతు
బండి సంజయ్ మహా పాదయాత్రకు గుగ్గిళ్ల నుంచి తరలిన నాయకులు, కార్యకర్తలు బెజ్జంకి, నవంబర్ 23 (ప్రజావాణి) ఎస్ఐఆర్ అంశంపై విపక్షాల వైఖరిని నిరసిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛలో కరీంనగర్ మహా పాదయాత్రకు బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామం నుంచి బీజేపీ శ్రేణులు తరలివెళ్లారు.'ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. అరాచకవాదాన్ని అంతం చేద్దాం' అనే నినాదంతో చేపట్టిన పాదయాత్రను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఉత్సాహంగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో...