* *పేద కుటుంబానికి భరోసాఇందిరమ్మ జీవిత బీమా పథకం*
*మంచిర్యాలలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ చేతుల మీదుగా*
*దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం ఆన్లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభం* *
మంచిర్యాల, ప్రజావాణి రిపోర్టర్, నవంబర్ 23:
ప్రతి కుటుంబానికి ఒక భరోసా కల్పించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 07వ డివిజన్ 8 అంబేద్కర్ గ్రౌండ్ లో రూ.5 లక్షల బీమా కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, ఆన్లైన్ నమోదు ప్రక్రియను మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనే గొప్ప లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా రూ.5 లక్షల బీమా రక్షణ కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని వివరించారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, అడిషనల్ కమిషనర్ రాజు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పూదరి తిరుపతి, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, నాయకులు, కార్యకర్తలు, డివిజన్ల ప్రజలు పాల్గొన్నారు.