పలు వివాహాది శుభకార్యాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
• నూతన వధూవరులకు ఆశీర్వాదం.. శ్రీమంతం వేడుకలో పాల్గొని శుభాకాంక్షలు
జోగిపేట | నవంబర్ 23 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి
జోగిపేట పట్టణంలో పలు వివాహాది శుభకార్యాలకు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ హాజరయ్యారు. పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు డాకూరి గణేష్ ముదిరాజ్ కుమారుని వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ డి.బి. నాగభూషణం గారి కోడలు శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమాల్లో మాజీ ఏఎంసీ చైర్మన్ పి. నారాయణ ముదిరాజ్, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీపీ రామ గౌడ్, కౌన్సిలర్ పట్లూరి శివశేఖర్, లింగా గౌడ్, శశికుమార్, చాపల వెంకటేశం, ఎ. శంకరయ్య, ఖాజా పాషా, రఫిక్, డి. గణేష్, నాగరాజు, దాసరి దుర్గేశ్ తదితరులు పాల్గొన్నారు.