prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 5:34 pm Digital Edition : PRAJA VANI

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం.. బీసీ కాలనీలో ఇంకుడు గుంత నిర్మాణ పనులకు శ్రీకారం

**పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం.. బీసీ కాలనీలో ఇంకుడు గుంత నిర్మాణ పనులకు శ్రీకారం!**

వేలేరు: వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని బీసీ కాలనీలో వాటర్ ట్యాంక్ సమీపంలో ఎస్‌బీఎం (SBM), గ్రామపంచాయతీ నిధులతో చేపట్టనున్న కమ్యూనిటీ సోక్ పిట్ (సామూహిక ఇంకుడు గుంత) నిర్మాణ పనులకు సర్పంచ్ బిల్లా యాదగిరి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ.. వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేసే సమయంలో బయటకు వచ్చే నీరు వృథా కాకుండా భూమిలోకి ఇంకేలా ఈ ఇంకుడు గుంతను నిర్మిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల భూగర్భ జలాల మట్టం పెంపొందించడంతో పాటు నీటి సంరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

అదేవిధంగా నీరు బహిరంగ ప్రదేశాల్లో నిల్వ ఉండకుండా చేయడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని, చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిశుభ్రమైన వాతావరణం కల్పించవచ్చని తెలిపారు. గ్రామంలో పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీకర్, గ్రామపంచాయతీ కార్యదర్శి విజయ, వార్డు సభ్యులు రణధీర్ రెడ్డి, సునీల్, గ్రామ పెద్దలు, కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.