డోర్నకల్ అభివృద్ధిలో మరో ముందడుగు!
సీరోల్ మండల ప్రజలకు మెరుగైన పాలన.. నాణ్యమైన వైద్య సేవలు!
సీరోల్: నవంబర్ 23 (ప్రజావాణి)
మహబూబాబాద్ జిల్లా
సీరోల్ మండల కేంద్రంలో నూతన ఈవో కార్యాలయ భవనం, 10 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించిన ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ గారు.
డోర్నకల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేయడంతో పాటు, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 10 పడకల ఆసుపత్రి అందుబాటులోకి రావడంతో సీరోల్ మండల ప్రజలకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహ శబరీష్ గారు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సుధాకర్. జిల్లా నాయకులు లాలు నాయక్. ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.