జనగామ మెడికల్ కాలేజీ ఈ నెల 27న ప్రారంభోత్సవం.మంత్రులు దామోదర్, పొన్నం ఆదేశం

  జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 23 (ప్రజావాణి): జనగామ మెడికల్ కాలేజీ భవనం, క్రిటికల్ కేర్ బ్లాక్ (సీసీబీ) ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు వెంటనే చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో వైద్య సేవల పనితీరుపై మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు రూ.154 కోట్ల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో జనగామ మెడికల్ కాలేజీ, క్రిటికల్ కేర్ బ్లాక్...