*చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యం.. పోలియో రహిత సమాజమే ధ్యేయం*
*వార్డు నంబర్ 7లో స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ*
*కార్యక్రమంలో పాల్గొన్న వకీల్ చౌహాన్, వార్డు ప్రెసిడెంట్ షకీల్ పటేల్*
జహీరాబాద్, నవంబర్ 22 (ప్రజావాణి): మున్సిపాలిటీ పరిధిలోని వార్డులోని చిన్నారులకు 7 వ వార్డు కౌన్సిలర్ వకీల్ చవాన్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.
ప్రజల ఆరోగ్యం, సంక్షేమం మరియు అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
చిన్నారులను పోలియో మహమ్మారి నుంచి రక్షించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చౌదరిగుడ కౌన్సిలర్ వకీల్ చౌహాన్ పిలుపునిచ్చారు. ఆదివారం నాడు, పార్టీ ప్రెసిడెంట్ షకీల్ పటేల్ , వైస్ ప్రెసిడెంట్ శేఖర్ , అందరూ కలసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గం సభ్యులు అంగన్వాడి సిబ్బంది అనిత , పద్మమ్మ,తదితరులు పాల్గొన్నారు.