prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 10:34 am Digital Edition : PRAJA VANI

గొంపల్లి జిపి లో ఇందిరమ్మ బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ

గొంపల్లి జిపి లో ఇందిరమ్మ బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ . ప్రజావాణి చర్ల నవంబర్ 23 : చర్ల మండలంలోని గొం పల్లి గ్రామపంచాయతీలో ఈరోజు నుండి 30 రోజులపాటు ఇందిరమ్మ బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ జరగనున్నట్లు పంచాయతీ కార్యదర్శి బైరెడ్డి నవీన్ తెలిపారు. దరఖాస్తుదారులందరూ రేషన్ కార్డు జిరాక్స్ ఇంటి పన్ను జిరాక్స్ ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ పుస్తకం జిరాక్స్ లు తప్పనిసరిగా సమర్పించవలసి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు. అంతేకాకుండా గ్రామపంచాయతీ ఆఫీస్ నందు ఈ రోజు నుండి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. కాబట్టి పంచాయతీ పరిధిలో గల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని ఆయన ప్రజలను కోరారు.