గిరిజన విద్యార్థుల అభ్యాస సామర్థ్యాల పెంపునకు క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ఐటీడీఏ పిఓ
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 23 (ప్రజావాణి):గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, వారిలోని అభ్యాస సామర్థ్యాలను గుర్తించి మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో సూచించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఆయన జనగామ జిల్లాలోని పలు గిరిజన సంక్షేమ విద్యాసంస్థలను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా సోమవారం జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల (AHS), స్టేషన్ ఘన్పూర్ బాలుర ప్రాథమికోన్నత...