prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 8:35 pm Digital Edition : PRAJA VANI

కేసీఆర్ పేరు మీద గొంగిడి సునీత పూజలు..

*కేసీఆర్ పేరు మీద గొంగిడి సునీత పూజలు…*

*అరిష్టం తొలగిపోవాలని స్పటిక లింగానికి అభిషేకం.*

*2028లో కెసిఆర్ ముఖ్యమంత్రి..!*

*మాజీ ప్రభుత్వ విప్ ఆలేరు మాజీ శాసన సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 23*

కార్తీక సోమవారం సందర్భంగా యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని మరియు రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మాజీ ప్రభుత్వ విప్ , ఆలేరు మాజీ శాసన సభ్యురాలు , నియోజక వర్గ ఇంచార్జ్ గొంగిడి సునిత మహేందర్ రెడ్డి.
దేవస్థానంలో శివకేశవుల నిలయమైన శ్రీ పార్వతి వర్ధిని సమేత రామ లింగేశ్వర స్వామి వారి ఆలయంలో స్పటిక లింగానికి అభిషేకం చేసి కేసీఆర్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రానికి పట్టిన అరిష్టం తొలగి పోవాలని , కేసీఆర్ ప్రభుత్వం తిరిగి అధికారం లోకి రావాలని , రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషా లతో ఉండాలని స్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు.