prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 10:58 pm Digital Edition : RAJASHEKARREDDY

కూరగాయల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం

పందిరి సాగు చేపట్టే రైతులకు అవకాశం.. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి

బెజ్జంకి, నవంబర్ 23 (ప్రజావాణి):

రైతులకు అదనపు ఆదాయం కల్పించడంతో పాటు కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు వీబీజీ రామ్‌జీ (VBG RAM-G) పథకం కింద కూరగాయల పందిరి సాగుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నట్లు బెజ్జంకి ఎంపీడీవో ప్రవీణ్ తెలిపారు. ఆసక్తి ఉన్న అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ పథకానికి ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు అర్హులని, ఐదు ఎకరాల లోపు భూమి కలిగి ఉండాలని, ఉపాధి హామీ జాబ్ కార్డు తప్పనిసరిగా ఉండాలని సూచించారు.దరఖాస్తుతో పాటు రైతు ధ్రువీకరణ పత్రం, చిన్న, సన్నకారు రైతు సర్టిఫికెట్, పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్, ఉపాధి హామీ జాబ్ కార్డు జిరాక్స్, గ్రామపంచాయతీ తీర్మానం సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.పథకం వివరాల ప్రకారం అర ఎకరంలో 100 పందిరి యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే కూలీల ఖర్చు కింద రూ.36,800, మెటీరియల్ ఖర్చు కింద రూ.98,000 కలిపి మొత్తం రూ.1,34,800 వరకు నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఆసక్తి గల రైతులు మరిన్ని వివరాలు, దరఖాస్తుల కోసం సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శిని సంప్రదించాలని ఎంపీడీవో ప్రవీణ్ కోరారు.