prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 1:35 pm Digital Edition : PRAJA VANI

కాసిపేటలో మహిళా సమాఖ్య నూతన భవనం ప్రారంభం

కాసిపేటలో మహిళా సమాఖ్య నూతన భవనం ప్రారంభం
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
దండేపల్లి, నవంబర్ 22 (ప్రజావాణి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని కాసిపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీఆర్‌డీఓ, డీపీఓ కిషన్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో భాగంగా లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, డీఆర్‌డీఓ కిషన్‌లు పెన్షన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లక్కాకుల వనిత సృజన్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రసాద్, తహసీల్దార్ రోహిత్, లక్షెట్టిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, సింగిల్ విండో చైర్మన్ ముత్యాల శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా ఆర్‌జీపీఆర్‌ఎస్ అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అనితతో పాటు వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఉప సర్పంచులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.