prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 7:17 am Digital Edition : SRIKANTH MULUGU

ఒకప్పుడు నవ్విన ఇల్లు, ఇప్పుడు గుడుంబా వల్ల ఏడుపుల ఇల్లు అయింది

ఒకప్పుడు నవ్విన ఇల్లు, ఇప్పుడు గుడుంబా వల్ల ఏడుపుల ఇల్లు అయింది.

-పసర ఎస్సై తాజుద్దీన్ సందేశం.

ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి)

గోవిందరావుపేట మండలం రాంనగర్ గ్రామంలో పస్రా పోలీసులు గుడుంబా బట్టీపై మెరుపుదాడి చేశారు. ఇంట్లోనే బట్టీ పెట్టి గుడుంబా తయారు చేస్తున్న వారిని పట్టుకున్నారు. గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు.

ఇది కేవలం ఒక దాడి కాదు ఇది ఎన్నో ఇళ్ల కన్నీటి కథ.
ఒకప్పుడు ఆ ఇళ్లలో నవ్వులు ఉండేవి. పిల్లల ఆటలు, అమ్మ వండిన అన్నం వాసన, కుటుంబం అంతా కలిసి తినే సాయంత్రం ఉండేది. ఇప్పుడు అదే ఇంట్లో సాయంత్రం అయితే చాలు భయం. తాగి వచ్చే భర్త, తాగి వచ్చే కొడుకు, ఇంట్లో గొడవ, పిల్లల ఏడుపు.
కూలి చేసి తెచ్చిన డబ్బు ఇంటికి రాకుండా గుడుంబా పాలవుతోంది. ఇంట్లో పిల్లలకు పాలు లేవు, పుస్తకాలు లేవు, కానీ గుడుంబా కోసం డబ్బులు దొరుకుతున్నాయి. తల్లి కన్నీళ్లు తుడిచే వారు లేరు. భార్య బాధ చెప్పుకునే వారు లేరు.
గుడుంబా అమ్మే వారికి ఇది వ్యాపారం కావచ్చు. కానీ తాగే వారి కుటుంబాలకు ఇది నరకం. ఒక ఇంట్లో బట్టీ వెలిగితే, ఎన్నో ఇళ్లలో దీపాలు ఆరిపోతున్నాయి.
ఇప్పుడైనా ఈ గుడుంబా ఆగాలి. గ్రామంలో మళ్ళీ నవ్వులు రావాలి. పిల్లలు భయం లేకుండా నిద్రపోవాలి. తల్లుల కన్నీళ్లు ఆగాలి. అందుకే గవర్నమెంట్, పోలీసులు కలిసి గుడుంబాను పూర్తిగా అంతం చేయాలి.
మన ప్రజావాణి( శ్రీకాంత్) ప్రజల గళం, బాధిత కుటుంబాల గళం.