ఎన్నికల హామీని నిలబెట్టుకున్న కౌన్సిలర్ రాధిక శ్రీనివాస్
*ఎన్నికల హామీని నిలబెట్టుకున్న కౌన్సిలర్ రాధిక శ్రీనివాస్* *9వ వార్డులో 25 మంది అర్హులకు నూతన పెన్షన్ల పంపిణీ.. హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో భైంసా నవంబర్ 23:– ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భైంసా పట్టణంలో 9వ వార్డు కౌన్సిలర్ తాలోడ్ రాధిక శ్రీనివాస్ మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు. గత మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వార్డు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అర్హులైన వారికి నూతన పెన్షన్లు మంజూరు చేయించడంలో కృషి...