prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 4:59 pm Digital Edition : PRAJA VANI

ఎన్నికల హామీని నిలబెట్టుకున్న కౌన్సిలర్ రాధిక శ్రీనివాస్

*ఎన్నికల హామీని నిలబెట్టుకున్న కౌన్సిలర్ రాధిక శ్రీనివాస్*

*9వ వార్డులో 25 మంది అర్హులకు నూతన పెన్షన్ల పంపిణీ.. హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు*

నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో భైంసా నవంబర్ 23:–
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భైంసా పట్టణంలో 9వ వార్డు కౌన్సిలర్ తాలోడ్ రాధిక శ్రీనివాస్ మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు. గత మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వార్డు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అర్హులైన వారికి నూతన పెన్షన్లు మంజూరు చేయించడంలో కృషి చేశారు. ఈ క్రమంలో సోమవారం 9వ వార్డుకు చెందిన 25 మంది నూతనంగా పెన్షన్‌కు అర్హత పొందిన లబ్ధిదారులకు కౌన్సిలర్ తాలోడ్ రాధిక శ్రీనివాస్, వార్డు పెద్దల సమక్షంలో పెన్షన్లను పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంతో వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పేదలు, వృద్ధులు, ఇతర అర్హులైన నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా కౌన్సిలర్ తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు. పెన్షన్లు అందుకున్న లబ్ధిదారులు కౌన్సిలర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.