ఎంపీడీఓ శంకర్ నాయక్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన ప్రముఖులు
ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 23
మిర్యాలగూడ,
మిర్యాలగూడ పట్టణంలోని తూడి ఫంక్షన్ హాల్లో ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా ఎంపీడీఓ శంకర్ నాయక్ కుమార్తె వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ వివాహ వేడుకలో పాల్గొన్న వారిలో శాసన మండలి సభ్యులు (ఎమ్మెల్సీ) కేతావత్ శంకర్ నాయక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా డిప్యూటీ సీఈఓ హీరలాల్ నాయక్, యాదగిరిగుట్ట తహసీల్దార్ గణేష్ నాయక్, యాదాద్రి భువనగిరి జిల్లా పరీక్షల విభాగం కార్యదర్శి పాండు నాయక్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ తిరుపతి నాయక్ ఉన్నారు.
వీరితో పాటు హెడ్ కానిస్టేబుల్ బిక్కు నాయక్, సీనియర్ ఉపాధ్యాయులు మక్ల నాయక్, భీమ్లా నాయక్, చందు నాయక్, సర్పంచ్ శ్రీహరి నాయక్, దాస్య నాయక్ తదితరులు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.