prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 2:58 pm Digital Edition : UPENDHAR JANAGON

ఉప్పుల సోమయ్య కుటుంబానికి అండగా సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్

 

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 23 (ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండల కేంద్రంలోని కొత్తవాడకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉప్పుల సోమయ్య ఇటీవల మరణించారు.

ఈ నేపథ్యంలో దేవరుప్పుల గ్రామ సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ సోమవారం వారి ఇంటికి వెళ్లి, కుటుంబ సభ్యులు ఉప్పుల అంజయ్య, ఉప్పుల బాబు, ఉప్పుల సైదులు, పత్తేపురపు శేఖర్ లను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ మాట్లాడుతూ, ఉప్పుల సోమయ్య మరణం పార్టీకి, గ్రామానికి తీరని లోటని అన్నారు. పార్టీ కోసం, గ్రామ అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు చిలుకూరి నరసయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉప్పుల అంజయ్య, చింత చంద్రయ్య, చింత బిక్షమయ్య, ఉప్పుల శ్రీనివాస్, గోవింద కొండయ్య, ఎర్ర మల్లయ్య, ఉప్పుల ముత్తయ్య, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు కారుపోతుల నరేష్, తోటకూరి మహేష్, కారుపోతుల సతీష్, కారుపోతుల సురేష్, ఉప్పల అనిల్ కుమార్, గాదరి బాబు, గంగాడి అఖిల్ రెడ్డి, పాము శేఖర్, గిలకత్తుల రాకేష్, లోడంగి యాకన్న, గ్రామ ప్రజలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.