prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 8:44 pm Digital Edition : PRAJA VANI

అయ్యగారిపల్లిలో యాసంగి సాగుపై అవగాహన

అయ్యగారిపల్లిలో యాసంగి సాగుపై అవగాహన
ప్రజావాణి,ఇనుగుర్తి: మండలంలోని అయ్యగారి పల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఎంఏఓ ఎస్.కె. యాస్మిన్ ఆధ్వర్యంలో స్థానిక సర్పంచి మలిశెట్టి శోభన్ అధ్యక్షతన సోమవారం యాసంగి సాగు, ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఏవో యాస్మిన్ మాట్లాడుతూ సూపర్ ఎల్ నీ నో ప్రభావం వలన వర్షాభావం ఏర్పడి ఈ సారి వర్షాలు ప్రపంచవ్యాప్తంగా పడలేదన్నారు.ఎల్ని నో అంటే పసిఫిక్ మహాసముద్రం ఉపరితల జలాలు వేడెక్కడం వలన అక్కడ వేడి గాలులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి మనకు తరుచుగా రావలసిన రుతుపవనాలు వచ్చే దిశలను మార్చడం తో మన వైపు రావలసిన రుతుపవనాలు దిశలుమారి ఎక్కడో ఒకచోట కుంభవృష్టిగా పడడం జరిగిందని చెప్పారు.మనకు వర్షాలు లేనందున భూగర్భ జలాలు పడిపోయి ఈ యాసంగి పంటకు నీటి కొరత ఏర్పడిందన్నారు. కరెంటు ఉత్పత్తి కూడా నదీ జలాలతోనే జరుగుతున్నందున వర్షాలు లేక కరెంటు ఉత్పత్తి జరగడం లేదని తెలిపారు.ప్రభుత్వం దీన్ని ముందే అంచనా వేసి సోలార్ కరెంటు ఉత్పత్తి కొరకు ఏర్పాట్లు చేయిస్తున్నారు. సమయానికి అందవచ్చు, అందకపోవచ్చు అన్నారు.

*ఆరుతడి పంటలే వేసుకోవాలి.. ఎంఏవో*

ఎల్ని నో, వర్షాలు లేని కారణంగా రైతులు నీటి ఆధారిత పంటలు కాకుండా ఆరుతడి పంటలైన జొన్న సజ్జ మినుము,పెసర, కూరగాయలు వంటి వి సాగు చేసుకోవాలని ఏవో యాస్మిన్ రైతులకు సూచించారు. వీటిని తక్కువ నీటితో పండించవచ్చని ఇవి లాభదాయకంగా ఉంటాయని తెలిపారు. ఇనుగుర్తి రైతు వేదికలో సబ్సిడీపై పెసర విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు.కార్యక్రమంలో విద్యుత్ ఏఈ లక్ష్మణ్, వార్డు సభ్యులు సూర్య నాయక్, ఏ ఈ ఓ భాస్కర్ రైతులు పాల్గొన్నారు.