prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 5:08 pm Digital Edition : PRAJA VANI

అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు శ్రీహరికి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

*అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు శ్రీహరికి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం*

– *కళాకారుడు శ్రీహరి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం: ప్రజాసంఘాల నాయకుడు కంబాలపల్లి భాస్కర్*

మంచాల, నవంబర్ 23 (ప్రజావాణి):

రంగస్థల కళాకారుడిగా, ప్రజానాట్యమండలి సభ్యుడిగా, స్వర్ణకారుడిగా, రాజకీయ నాయకుడిగా ప్రజలకు సుపరిచితుడైన ఆరుట్ల గ్రామానికి చెందిన రాగిపని శ్రీహరి ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజాసంఘాల నాయకులు ఆయనకు అండగా నిలిచారు.

మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని శ్రీహరి నివాసానికి వెళ్లిన ప్రజాసంఘాల నాయకుడు కంబాలపల్లి భాస్కర్ ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. దాతల సహకారంతో సేకరించిన రూ.11,500 ఆర్థిక సహాయాన్ని శ్రీహరికి అందజేశారు.

ఈ సందర్భంగా కంబాలపల్లి భాస్కర్ మాట్లాడుతూ రాగిపని శ్రీహరి గొప్ప రాజకీయ నాయకుడని, ప్రజానాట్యమండలి కళాకారుడిగా, స్వర్ణకారుడిగా ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవలందించారని కొనియాడారు. తన కళాబృందం ద్వారా ఎంతోమంది యువతీ యువకులను కళారంగం వైపు ప్రోత్సహించి, వారిలో సామాజిక చైతన్యం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి శ్రీహరి అని అన్నారు.

రాజకీయంగా కూడా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ప్రజల పక్షాన నిలిచిన వ్యక్తి అని గుర్తుచేశారు. అలాంటి గొప్ప కళాకారుడు నేడు అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ, తన సొంత ఇంటిని సైతం అమ్ముకొని అద్దె ఇంట్లో జీవనం సాగించడం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

కళారంగానికి, సమాజానికి ఎంతో సేవ చేసిన శ్రీహరి వంటి కళాకారులను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. దాతలు, ప్రజాసంఘాలు, సేవా సంస్థలు ముందుకు వచ్చి ఆయనకు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు