ప్రజలతో మమేకమవుతూ.. సునీహ విజయమే లక్ష్యంగా నల్లేరు విశ్వనాథ రెడ్డి దంపతుల విస్తృత ప్రచారం!
పోరుమామిళ్ల నవంబర్ 22ప్రజావాణి బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని పోరుమామిళ్ల మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన శ్రీమతి షేక్ సునీహ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు విస్తృతంగా రంగంలోకి దిగాయి.ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అదనపు సమన్వయకర్త శ్రీ నల్లేరు విశ్వనాథ రెడ్డి,ఆయన సతీమణి శ్రీమతి రామ లక్ష్మీ దేవి స్థానిక టిప్పర్ గౌస్వీధి,వాసవి నగర్ తదితర ప్రాంతాల్లో ఆదివారం సుడిగాలి పర్యటన చేపట్టారు. ఇంటింటికీ వెళ్తూ ప్రజలతో ఆత్మీయంగా మమేకమై,సునీహ కి...