prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 November 2026, 7:43 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

రంగసముద్రం పంచాయతీ అభివృద్ధి వైఎస్సార్‌సీపీతోనే సాధ్యం: సర్పంచ్ అభ్యర్థి పిలుపు

గత ప్రభుత్వ హయాంలోనే గ్రామాల రూపురేఖలు మారాయి
నేడు అధ్వాన్నంగా మారిన పార్కులు,అస్తవ్యస్తంగా పారిశుధ్య వ్యవస్థ
అధికారంలోకి రాగానే రంగసముద్రాన్ని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతాం
ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు

పోరుమామిళ్ల,నవంబర్ 22:ప్రజావాణి కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీ అభివృద్ధి చెందాలంటే రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడైన నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి స్థానిక ఓటర్లను అభ్యర్థించారు.రంగసముద్రం పంచాయతీ పరిధిలో వైఎస్సార్‌సీపీ నాయకులు,కార్యకర్తలతో కలిసి ఆమెతో  విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ,గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని,ప్రస్తుత దుస్థితిని ప్రజలకు వివరించారు.

గతంలోనే ప్రగతి పథం.నేడు పాలకుల నిర్లక్ష్యం

ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ,గతంలో తమ ప్రభుత్వ హయాంలో రంగసముద్రం పంచాయతీ పరిధిలో కోట్లాది రూపాయల నిధులతో రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తుచేశారు.నాడు గ్రామాలలోని ప్రతి వీధిలోనూ సిసి రోడ్లు,డ్రైనేజీలు,ప్రజల ఆహ్లాదం కోసం అత్యాధునిక వసతులతో పార్కులను కంప్లీట్ చేసి పంచాయతీ రూపురేఖలను మార్చేశామని స్పష్టం చేశారు.
అయితే,ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం వల్ల నాడు తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పార్కులు నేడు చెత్తాచెదారంతో నిండి,పశువుల పాకలుగా,అధ్వాన్నంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.కనీసం పారిశుధ్య నిర్వహణను కూడా ఈ ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు.

అద్దె కట్టలేని స్థితిలో చెత్త సేకరణ వాహనాలు

గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు గతంలో ప్రవేశపెట్టిన చెత్త సేకరణ వాహనాల (గార్బేజ్ వెహికల్స్) పరిస్థితి నేడు దయనీయంగా మారిందని సర్పంచ్ అభ్యర్థి ఆరోపించారు.కనీసం ఆ వాహనాలకు అద్దె (రెంట్) కూడా కట్టలేని దుస్థితిలో ప్రస్తుత పంచాయతీ పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. వాహనాల రెంట్లు బకాయి పడటంతో గ్రామంలో చెత్త సేకరణ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందని, వీధులన్నీ మురికికూపాలుగా మారుతున్నా అధికారులు,పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో రంగసముద్రం పంచాయతీ ప్రజలు తనకు అవకాశం ఇచ్చి,గెలిపించిన వెంటనే ఈ సమస్యలన్నింటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని సర్పంచ్ అభ్యర్థి హామీ ఇచ్చారు.తాము అధికారంలోకి వచ్చిన ఎమ్మటే నిధులు కేటాయించి,అస్తవ్యస్తంగా మారిన పార్కులను పునరుద్ధరిస్తామని,పారిశుధ్య వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి వాహనాల అద్దె సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు,ప్రతి వీధికీ అభివృద్ధిని చేరవేసే బాధ్యత తమదేనని భరోసా ఇచ్చారు. రంగసముద్రం పంచాయతీ పరిధిలో జరిగిన ఈ విస్తృత ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు,ప్రజాప్రతినిధులు పాల్గొని సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ఓట్లు సేకరించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గిరి ప్రణీత్ రెడ్డి,ఎంపీటీసీ చిత్త రవి ప్రకాష్ రెడ్డి (మాజీ సర్పంచ్),ఆదిత్య రెడ్డి (రాష్ట్ర యువజన వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి) చాపాటి నారాయణరెడ్డి రుద్రవరం రాము.ముత్యాల ప్రసాదు (మాజీ జెడ్పీటీసీ) ఈ పర్యటనలో నాయకులు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ హయాంలోనే గ్రామీణ ప్రాంతాలు ఆర్థికంగా,సామాజికంగా బలోపేతమయ్యాయని,మళ్లీ ఆ సువర్ణ యుగం రావాలంటే రంగసముద్రంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పెద్దలు,యువకులు,మహిళలు,వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.