prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 November 2026, 9:19 pm Digital Edition : UPENDHAR JANAGON

హామీ అంటే హామీనే.. పెద్దమడూరులో ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి ముందడుగు వేసిన బబ్బూరి శ్రీకాంత్ గౌడ్

 

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 22 (ప్రజావాణి): ఎన్నికల వేళ ప్రజల ముందు పెట్టిన మాటను నిలబెట్టుకోవడమే నిజమైన నాయకత్వమని ప్రముఖ పారిశ్రామికవేత్త, బీఆర్ఎస్ జిల్లా నాయకులు బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ నిరూపించారు.

జిల్లా లోని దేవరుప్పుల మండలం, పెద్దమడూరు గ్రామంలో గత సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో గ్రామస్తులు కోరిన విధంగా ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించి ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చే దిశగా ఆదివారం ఆయన కీలక అడుగు వేశారు. ఆలయ నిర్మాణ పనులకు సహకరిస్తానని గ్రామస్తుల ముందు మరోసారి స్పష్టమైన భరోసా ఇచ్చారు.

సర్పంచ్ పానుగంటి గిరి నేతృత్వంలో గ్రామ పెద్దలు, యువకులు శ్రీకాంత్ గౌడ్ నివాసానికి చేరుకుని ఆలయ నిర్మాణం విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన శ్రీకాంత్ గౌడ్, గ్రామం కోసం తాను ఎప్పుడూ ముందుంటానని చెప్పారు. ఆలయం కేవలం ఒక నిర్మాణం కాదని, గ్రామ ప్రజలందరి భక్తి, ఐక్యతకు ప్రతీక అని ఆయన పేర్కొన్నారు.

ఎన్నికల్లో చెప్పిన ప్రతి మాటను దశలవారీగా అమలు చేస్తూ వెళ్తామని, అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే అందరూ ఒక్కటిగా నిలవాలని, కులం, మతం అనే తేడా లేకుండా కలిసి పని చేయాలని ఆయన గ్రామస్తులకు సూచించారు.

ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, కుల పెద్దలు శ్రీకాంత్ గౌడ్ ను శాలువాతో సత్కరించి, హామీని నిలబెట్టుకుంటున్నందుకు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ పానుగంటి గిరి, ఉప సర్పంచ్ చంద్రగిరి సంపత్ గౌడ్, దుబ్బ రాజశేఖర్ గౌడ్, నాయకపు శేఖర్ గౌడ్, హరిజన కుల పెద్దలు, కులస్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.