సత్యదేవుని మాలదారులకు దీక్ష వస్త్రాల పంపిణీ
ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం నవంబర్. 22
పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరంమండలం: అన్నవరం శ్రీ సత్యదేవుని మాల ధరించే భక్తులకు ఆదివారం నాడు టేకుల బోరులో దుస్తులు మరియు మాలలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు కూనవరం జడ్పిటిసి పాయం వెంకయ్య తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఎడవెల్లి భాస్కరరావుఈ కార్యక్రమానికి హాజరై భక్తులకు దీక్ష వస్త్రాలను అందజేశారు.
ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో సత్యదేవుని దీక్ష కోసం అడ్డతీగల పవనగిరి ఆశ్రమం ఆధ్వర్యంలో దీక్షదారులకు దుస్తులు మాలలు ఉచితంగా అందజేస్తారు.
ఈ సంవత్సరం ఇప్పటికే మండలంలోని భక్తులకు దీక్ష వస్త్రాలను అంద చేయడం జరిగిందని ఈరోజు టేకుల బోరు కోతుల గుట్ట కూటూరు కు చెందిన భక్తులకు దీక్ష వస్త్రాలను అందజేస్తున్నట్లు నిర్వాహకులు సాత్నగిరి రాధాకృష్ణ దంపతులు తెలియజేశారు.
సత్యదేవుని దీక్ష వస్త్రాల పంపిణీ కార్యక్రమంలో జడ్పిటిసి పాయం వెంకయ్య,కూనవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎడవెల్లి భాస్కరరావు, మండల ప్రధాన కార్యదర్శి పోడియం అప్పారావు కూనవరం మాజీ సర్పంచ్ కట్టం సునీత రాధాకృష్ణ భక్తులు సీత రాధా రాజమ్మ భక్తులు తదితరులు పాల్గొన్నారు.
