prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 November 2026, 6:45 am Digital Edition : PRAJA VANI

విద్యార్థినిని చితకబాదిన ఉపాధ్యాయుడు

విద్యార్థినిని చితకబాదిన ఉపాధ్యాయుడు

*విద్యార్థినిని కర్రతో ఇష్టానుసారంగా 10 దెబ్బలు కొట్టిన ఉపాధ్యాయుడు తాటి సత్తిబాబు పై ఐ టి డి ఏ అధికారులు చర్యలు తీసుకోవాలి – తుడుందెబ్బ గిరిజన సంఘం, పి వై ఎల్ యువజన సంఘం డిమాండ్*
ప్రజావాణి భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 21: దుమ్ముగూడెం మండలం లోని చిన్నబండిరేవు పంచాయతీ పరిధిలోగల గడ్డురోగట్టు గ్రామంలోని గిరిజన ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు తాటి సత్తిబాబు (గోవిందపురం గ్రామం) గత మూడు సంవత్సరాలుగా విద్యార్థులను కారణం లేకుండా లెక్కలు ఎలా చెయ్యాలో చెప్పకుండా కర్రతో ఇష్టానుసారంగా కొడుతూ కాళ్ళు మొక్కితే వదిలేస్తా అని , కుంజ శ్రీవల్లి అనే విద్యార్థినిని పది దెబ్బలకు పైగా కొట్టారని విద్యార్థిని తల్లిదండ్రులకు తెలపడంతో తల్లిదండ్రులు గిరిజన సంఘాలు పాఠశాలలో విద్యార్థులపై చేయి చేసుకున్న ఉపాధ్యాయుడు తాటి సత్తిబాబును తక్షణమే విధులనుండి బహిష్కరించాలని *తుడుందెబ్బ గిరిజన సంఘం, పి వై ఎల్ యువజన సంఘం ఆరోపించాయి.*
ఈ సందర్భంగా తుడుందెబ్బ గిరిజన సంఘం మండల కార్యదర్శి *పర్సుక గోపాలకృష్ణ*, పి వై ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ *ముసలి సతీష్,* ఉపాధ్యక్షులు *ఉబ్బ రామారావు మాట్లాడుతూ.*.
విద్యార్థులకు చదువు చెప్పి తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, చెప్పుకోలేని విధంగా కొడుతూ, నడుము, తొడలపై గిల్లడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
ఈ విషయంపై గతంలోనే ప్రధానోపాధ్యాయులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి మార్పు రాలేదని, అందుకే ఇప్పటికైనా ఐటీడీఏ అధికారులు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
తాటి సత్తిబాబు అనే ఉపాధ్యాయుడిపై తక్షణమే విచారణ జరిపి సస్పెండ్ చేయాలని,
విద్యార్థిని కుంజ శ్రీవల్లితో పాటు బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని,వైద్య పరీక్షలు చేయించాలని,
పాఠశాలలో ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని,
లేని యెడల ఆదివాసీ సంఘాలను, ప్రజాసంఘాలను ఐక్యం చేసి దుమ్ముగూడెం మండలాన్ని కేంద్రంగా చేసుకొని ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం భద్రాచలం డివిజన్ కార్యదర్శి మట్టా నరసింహారావు, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ దుమ్ముగూడెం మండల కార్యదర్శి కామ్రేడ్ కొంజ జోగారావు తదితరులు పాల్గొన్నారు.