prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 November 2026, 10:21 am Digital Edition : PRAJA VANI

లక్ష్మి పూజలో హాజరైన న్యాల్కల్ మండల జడ్పిటిసీ స్వప్న భాస్కర్

*లక్ష్మి పూజలో హాజరైన న్యాల్కల్ మండల జడ్పిటిసీ స్వప్న భాస్కర్*

జహీరాబాద్, నవంబర్ 21 (,ప్రజావాణి): లక్ష్మిదేవి ఆశీస్సులతో సబ్బండా వర్గాల వారు సుఖ సంతోషలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులందరు పడి పంటలతో కళకళలాడాలని న్యాల్కల్ మండలం జడ్పిటిసీ బోడ స్వప్న భాస్కర్ అన్నారు. న్యూ మహీంద్రా కాలనీలో గల గుంజేటి గ్రామ సర్పంచ్ బొమ్మ దేశెట్టి పాటిల్ కార్యాలయంలో లక్ష్మి పూజని పురస్కరించుకొని సర్పంచ్ దేశెట్టి పాటిల్ ఆహ్వానం మేరకు జడ్పిటిసీ స్వప్న భాస్కర్ దంపతులకు శాలువాకప్పి సత్కరించి వారికీ ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు చంద్రశేఖర్ స్వామి, పట్టణ ప్రముఖ పురోహితులు నరేష్ స్వామి, రవికాంత్, మడివల్ శ్రీకర్, జర్నలిస్టులు అబ్దుల్లా సిద్ధిఖి, సయ్యద్ మహేబూబ్, మొహమ్మద్ కరీం, శ్రీనివాస్ శాస్త్రి, తలారి అశోక్, శ్రీనివాస్, మొహమ్మద్ అలావుద్దీన్, స్నేహ బృందం తదితరులు పాల్గొన్నారు.