prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 November 2026, 7:06 am Digital Edition : PRAJA VANI

మహా పాదయాత్ర విజయవంతానికి బీజేపీ కార్యకర్తల సమ్మేళనం

మహా పాదయాత్ర విజయవంతానికి బీజేపీ కార్యకర్తల సమ్మేళనం

23న కరీంనగర్‌లో బండి సంజయ్ నిర్వహించే పాదయాత్రకు భారీగా తరలిరావాలని పిలుపు

తంగళ్లపల్లి ప్రజావాణి నవంబర్ 21 మండలంలోని బద్దెనపల్లి గ్రామంలో ఎస్.ఎస్. గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో బీజేపీ మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో కార్యకర్తల సమ్మేళనం, ఈ నెల 23న కరీంనగర్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్ కుమార్ నిర్వహించనున్న మహా పాదయాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముంజ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ, ఈ నెల 23న కరీంనగర్‌లో నిర్వహించే మహా పాదయాత్రను విజయవంతం చేసేందుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఐఆర్ అంశంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ ప్రజలకు వాస్తవాలను వివరించాలని కార్యకర్తలకు సూచించారు.ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు, మైనారిటీ మోర్చా అధ్యక్షుడు సబీర్, మహిళా మోర్చా అధ్యక్షురాలు గుర్రం అనసూర్య మహేందర్, జిల్లా మీడియా కన్వీనర్ కసుగంటి రాజు, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి సూరుకొంటి తిరుపతి రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు కొంకటి వేణు, మండల ప్రధాన కార్యదర్శి కోస్ని వినయ్, అంకుసాపురం సర్పంచ్ అంచ శ్రీనివాస్ రెడ్డి, దేశాయిపల్లి సర్పంచ్ రజిత రమేష్, పలువురు ఉప సర్పంచులు, శక్తి కేంద్రాల ఇంచార్జీలు, బూత్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.