మర్రిపల్లిగూడెంలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం

మర్రిపల్లిగూడెంలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రజావాణి నవంబర్ 22 మర్రిపల్లిగూడెం గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కదురు కవిత తిరుపతి, ఉపసర్పంచ్ తాడేం రాజేందర్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ కదురు కవిత తిరుపతి మాట్లాడుతూ ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని సూచించారు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు...