prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 November 2026, 11:14 am Digital Edition : PRAJA VANI

మంచాలలో ఘనంగా పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభం

*మంచాలలో ఘనంగా పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభం*

*ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి – సర్పంచ్ మానస వినయ్*

మంచాల, నవంబర్ 22 (ప్రజావాణి):

మంచాల మండల కేంద్రంలోని మంచాల గ్రామంలో ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మానస వినయ్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మానస వినయ్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు ఉన్న చిన్నారులందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.

గ్రామంలో ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించుకోకుండా మిగిలిపోకూడదని, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమం నిర్వహణ కోసం మంచాల గ్రామంలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఒకటి, ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో మరొక కేంద్రాన్ని ఏర్పాటు చేసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.