prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 November 2026, 5:25 pm Digital Edition : PRAJA VANI

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గణేష్ కుమారుని వివాహ వేడుకకు హాజరైన మఠం బిక్షపతి

*బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గణేష్ కుమారుని వివాహ వేడుకకు హాజరైన మఠం బిక్షపతి*

అందోల్ | నవంబర్ 22 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి

అందోల్–జోగిపేట పట్టణంలోని లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్‌లో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గణేష్ కుమారుని వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మాజీ రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ మఠం బిక్షపతి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా వివాహ వేడుకలో పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామగౌడ్,మాజీ కోఆప్షన్ మెంబర్ ఫైసల్‌, నాగరాజు తో పాటు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.