*ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి : చైర్మన్ ఏం డి యూనుస్*
*స్మార్ట్ కార్డుతో అన్నీ సంక్షేమ పథకాలు : కౌన్సిలర్ నయ్యర్ జఫర్*
*34 వ వార్డులో స్మార్ట్ కార్డులు పంపిణి చేసిన చైర్మన్, కౌన్సిలర్*
జహీరాబాద్, నవంబర్ 21 (ప్రజావాణి): రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలను చేరవేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని మున్సిపల్ చైర్మన్ మొహమ్మద్ యునుస్ అన్నారు. శనివారం నాడు పట్టణంలోని శాంతినగర్ లో భాగమైన 34 వ వార్డులో స్థానిక కౌన్సిలర్ మహమ్మద్ నయ్యర్ జఫర్ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణి చేపట్టారు. ఈ సందర్బంగా కౌన్సిలర్ మాట్లాడుతూ అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు రేషన్ సరుకులు పొందడంలో మరింత సౌలభ్యం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రజాప్రతినిధులు నిరంతరం కృషి చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ ఖాజామీయా, నాయకులు మొహమ్మద్ జాఫర్, మొహమ్మద్ ఆమెర్, నర్సింహా యాదవ్, వార్డు ప్రజలు, లబ్ధిదారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.