prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 November 2026, 10:19 am Digital Edition : PRAJA VANI

పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ పెండింగ్ కేసుల పరిష్కారానికి వేగం పెంచాలి..

పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్
పెండింగ్ కేసుల పరిష్కారానికి వేగం పెంచాలి.. సిబ్బందికి సీపీ సునీల్ దత్ ఆదేశాలు
పాలేరు, నవంబర్ 21 (మన ప్రజావాణి) ప్రతినిధి: తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్‌ను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డులను పరిశీలించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సీసీటీఎన్‌ఎస్ వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని, మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడంతో పాటు రహదారి భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు.
పెండింగ్‌లో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి పరిష్కరించాలని, కేసుల పురోగతిని నిరంతరం సమీక్షించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు.
అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడి విధి నిర్వహణపై పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు.