పలు వివాహ వేడుకలో పాల్గొని
నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన
మాజీ శాసన సభ్యుడు పుట్ట మధూకర్
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి: నవంబర్
పెద్దపల్లి పట్టణంలోని స్వరూప గార్డెన్లో కమాన్పూర్ మండలం నాగారం గ్రామానికి చెందిన మాడిశెట్టి శ్రీనివాస్ కుమార్తె శ్రీ విద్య, ప్రణయ్ కుమార్ల వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు.
ఈ వివాహ వేడుకకు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వధూవరులకు పూలమాలలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
అనంతరం వధూవరుల కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.