prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 November 2026, 1:08 pm Digital Edition : UPENDHAR JANAGON

నెల్లుట్లలో గవర్నర్ ఇంద్రసేన రెడ్డికి ఘన స్వాగతం… సర్పంచ్ నర్సింగ రామకృష్ణ శాలువతో సత్కారం

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 22 (ప్రజావాణి): త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేన రెడ్డి వరంగల్ భద్రకాళి దేవాలయం దర్శనానికి వెళుతున్న క్రమంలో  ఆదివారం  జిల్లా లోని లింగాలఘణపురం మండలం,,నెల్లుట్ల గ్రామంలోని బీజేపీ రాష్ట్ర నాయకులు కేవీఎల్ఎన్ రాజు నివాసానికి విచ్చేశారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ గవర్నర్ నుమర్యాదపూర్వకంగా కలిసి శాలువతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దామెర కావ్య ప్రభాకర్, వార్డు మెంబర్లు వేల్పుల శోభారాణి, బత్తిని వేణు, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు మాచర్ల మహేందర్, పాక్స్ డైరెక్టర్ గుర్రం బాలరాజు, వీడీసీ చైర్మన్ బత్తిని అశోక్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నర్సింగ రమేష్, చిట్ల తిరుమల రెడ్డి, కొయ్యడ రామలింగం, కుర్రేముల రమేష్, కొయ్యడ రామచంద్రం, బెల్లకొండ ప్రణయ్, గాడిపెల్లి వెంకటేష్, మర్రి అమృత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.