జనగామ జిల్లా ప్రతినిధిజె.ఉపేందర్, నవంబర్ 22 (ప్రజావాణి): జనగామ నియోజకవర్గం చేర్యాల పట్టణంలో కళ్యాణి గార్డెన్స్‌లో V6 వెలుగు రిపోర్టర్ రాళ్లబండి జగదీశ్వరి గురుమూర్తి చారి కుమారుడు ప్రవీణ్ కుమార్ వివాహం అనన్యతో ఆదివారం ఘనంగా జరిగింది.
ఈ వివాహ వేడుకకు కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రిపోర్టర్ మాంకాల నగేష్, ఏఎంసీ డైరెక్టర్ గొల్లపల్లి శ్రీనివాస్, మండల కాంగ్రెస్ కిసాన్ అధ్యక్షులు బొచ్చు ఎల్లయ్య యాదవ్, మండల కాంగ్రెస్ నాయకులు జనగాం శ్రీకాంత్ గౌడ్, చింతల రమేష్ తదితరులు పాల్గొన్నారు.