*నిందితుడి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి – సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు జెర్రిపోతుల ధనంజయ*
నల్గొండ పట్టణంలో విధి నిర్వహణలో ఉన్న పారిశుధ్య కార్మికురాల చందుపట్ల రమణమ్మ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు జెర్రిపోతుల ధనంజయ తెలిపారు. శనివారం చండూరు మండల కేంద్రంలో నల్లగొండలో పారిశుధ్య కార్మికురాలు దాడి గురైన చందుపట్ల రమణమ్మ కు మద్దతుగా న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) చండూరు మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. చండూరు ప్రధాన బస్టాండు నుండి ఇందిరాగాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నల్గొండ పట్టణంలో అల్లరి మూకలు విధినిర్వహణలో ఉన్న మున్సిపల్ కార్మికులపై అక్రమంగా దాడి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఉదయం ఐదు గంటలకే విధులకు హాజరై తమ పనులను చేసుకుంటున్న క్రమంలో ఆ వీధిలో ఉన్న ఒక బాలకృష్ణ అనే స్థానికుడు అకారణంగా దాడి చేసి దౌర్జన్యంగా కర్రతో కొట్టడం జరిగిందని అన్నారు. కార్మికులకు రక్షణ లేని పరిస్థితి ఏర్పడుతుందని మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఉదారవాదంతో వదిలివేయడంతో మరింత దాడులు పెరుగుతున్నాయని అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి నిందితుడుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు మోగుదాల వెంకటేశం, చిట్టిమల్ల లింగయ్య, సిఐటియు మున్సిపల్ యూనియన్ నాయకులు బీపంగి నాగరాజు, కత్తుల సైదులు, నల్లగంటి లింగస్వామి, బోడ రాము, అన్నేపర్తి పెద్ద వెంకన్న, కృష్ణయ్య, రమేష్, బి. కళమ్మ, ఎల్లమ్మ, బుషిపాక బక్కమ్మ, నారపాక రేణుక, నల్లగంటి రవమ్మ, నల్లగంటి అలివేలు, ఇర్గి ఎల్లమ్మ, బుషిపాక ముత్తమ్మ, రజిత, చంద్రమ్మ, నల్లగంటి జంగమ్మ, గండూరి వెంకన్న, ఇర్గి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
