జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 22 (ప్రజావాణి):జనగామ లో ప్రముఖ కాంట్రాక్టర్ దోర్నాల శ్రీహరి కుమారుడు, ఇటీవల అమెరికా లో అకస్మాత్తుగా కీర్తిశేషులు అయిన శ్రవణ్ కుమార్ జయంతి సందర్భంగా ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రి వద్ద మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన రోగుల బంధువులు, పేదలు, నిరుపేద కుటుంబాలకు అన్నదానం చేసి దివంగత శ్రవణ్ కుమార్ ని ఘనంగా స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని దోర్నాల శశికాంత్, జనగామ పట్టణ మున్సిపల్ 15వ వార్డు కౌన్సిలర్ మారబోయిన పాండు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా జనగామ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణికుమార్, ప్రధాన కార్యదర్శి వంగ భీమ్ రాజ్ మాట్లాడుతూ, శ్రవణ్ కుమార్ జయంతి సందర్భంగా మహా అన్నదానం నిర్వహించిన దోర్నాల శశికాంత్, కౌన్సిలర్ పాండు యాదవ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సేవా కార్యక్రమంలో జనగామ అమ్మ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కొయ్యడ రవి, కొయ్యడ విశ్వ, సిద్దిరాల చందు, పిట్టల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.