*జిల్లా స్థాయి చెకుముకి పోటీలకు ఎంపిక*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
చండూరు హైస్కూల్లో శనివారం జన విజ్ఞాన వేదిక చెకుముకి మండల స్థాయి టాలెంట్ టెస్ట్‌ను నిర్వహించారు. ఇప్పటికే మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 12 హైస్కూళ్లలో 8,9,10వ తరగతి విద్యార్థులకు స్కూల్ స్థాయిలో టాలెంట్ టెస్ట్‌ను నిర్వహించారు. ప్రతి స్కూల్ నుంచి టెస్ట్‌లో టాపర్‌గా నిలిచిన ముగ్గురు విద్యార్థలను మండల స్థాయికి ఎంపిక చేశారు. చండూరు హైస్కూల్‌లో నిర్వహించిన మండస్థాయి పోటీలలో ముగ్గురు విద్యార్థులు కలిసి ఒక టీమ్ ఏర్పడి పరీక్ష రాశారు. ప్రభుత్వ, ప్రైవేటు, కస్తూర్భా-రెసిడెన్సియల్ ను కలిపి మొత్తం మూడు విభాగాల కింద పాఠశాలకు చెందిన టీమ్‌లను జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. ఇందు లో చండూరు హైస్కూల్, సన్‌షైన్ పాఠశాల, బోడంగిపర్తి రెసిడెన్సియల్ విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. ఈ కర్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు కోటేశ్వర్‌రెడ్డి, సీనియర్ స్కూల్ అసిస్టెంట్ విజయలక్ష్మి, ఉపాధ్యాయుడు కళ్లెం వెంకట్‌రెడ్డి, జనవిజ్ఞాన వేదిక డివిజన్ అధ్యక్షుడు రాపోలు ప్రభాకర్, మండల అధ్యక్షుడు సంగేపు మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.