prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 November 2026, 8:26 pm Digital Edition : UPENDHAR JANAGON

జలంధర్‌లోని శక్తిపీఠ్ త్రిపురమాలిని ఆలయాన్ని సందర్శించిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 22 (ప్రజావాణి): పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో కొలువై ఉన్న ప్రసిద్ధ శక్తిపీఠం శ్రీ త్రిపురమాలిని దేవాలయాన్ని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆదివారం సందర్శించారు.

ఈ సందర్భంగా అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకుని లోకకల్యాణం, ప్రజలందరికి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు.

ఆలయంలోని ఆధ్యాత్మిక వాతావరణంలో కొంత సమయం గడిపిన ఆమె, ఆలయ విశిష్టత, చరిత్ర గురించి అర్చకులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం అమ్మవారిని ప్రత్యేకంగా ప్రార్థించినట్లు తెలిపారు.